తెలంగాణ

telangana

ETV Bharat / city

అడుగడుగూ మునకే.. ప్రతి గుండె మడుగే - వరదలతో శివారు ప్రజల ఇక్కట్లు

నగరానికి దూరంగా... ప్రశాంతంగా ఉంటుందని శివార్లలో వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు కొన్నవారికి తాజా వరదలు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. లేఅవుట్లలో స్థలం తీసుకొని ఇళ్లు కట్టుకున్న చాలా కాలనీల్లో వరద నీరు చేరడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోకి వరద నీరు చేరడంతో అక్కడ ఉండ లేక.. కుటుంబాలతో సహా తాత్కాలికంగా హోటళ్లలోకి మార్చారు.

hyderabad city outcuts people facing problems with floods
అడుగడుగూ మునకే.. ప్రతి గుండె మడుగే

By

Published : Oct 21, 2020, 8:11 AM IST

రామాంతపూర్‌ పరిధిలోని రవీంద్రనగర్‌ కాలనీలో పలువురు వదర తాకిడి తీవ్ర అగచాట్లు పడుతున్నారు. పైన ఉన్న పెద్దచెరువు పొంగి పొర్లుతుండటంతో ఈ ప్రాంతంలో పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లల్లోని ఖరీదైన ఫర్నీచర్‌ ఇతర సామగ్రి తడిసిపోయింది. వరద నీటిలో ఉండలేక పలువురు సమీపంలోని హోటళ్లల్లో చేరి తలదాచుకుంటున్నారు. సరూర్‌నగర్‌లోని పలు కాలనీల పరిస్థితి అదే పరిస్థితి. ఏళ్లగా సాగు లేకపోవడంతో వాటిలో లేఅవుట్ల కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు కూడా మంజూరు చేశాయి. నగర గజిబిజి వాతావరణానికి దూరంగా.. ప్రశాంతంగా ఉండటంతో చాలామంది ఆయా ప్రాంతాల్లో స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు కొనసాగుతోంది.

మూసీకు కొట్టుకొస్తున్న వాహనాలు..

నగరం నుంచి వచ్చే మురుగు నీటిని నాగోలు, నల్లచెరువు, అంబర్‌పేటలో ప్రధాన మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఉన్నాయి. వరద తాకిడి, చెత్తాచెదారం భారీ ఎత్తున వస్తుండటంతో ప్రస్తుతం ఈ మూడు కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వరద అంతా బైపాస్‌ చేసి మూసీలోకి మళ్లిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఈ వరదకు కొట్టుకొస్తున్నాయి.

వర్షం పడిన ప్రతిసారి నీళ్లు చేరుతున్నా సరే.. ఒకటి రెండు రోజులు పరిస్థితి సద్దుమణిగేది. ఇదంతా తాత్కాలికమేననే ధీమా ఉండేది. అయితే ఈసారి భారీ వర్షాలు పడటంతో ఇంత వరద నీటిని అంచనా వేయడం ఎవరి తరం కాలేదు. శివార్లలోని దాదాపు 18 చెరువులు ఉప్పొంగడం.. కొన్ని కట్టలు తెగిపోవడంతో కాలనీలకు కాలనీలు ముంపులో ముగినిపోయాయి. లబోదిబోమంటూ చాలామంది కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేశారు. కొందరు చుట్టాలు ఇంట్లో.. మరికొందరు హోటళ్లలో గదులు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.

అధికార యంత్రాంగానికి సెలవులు రద్దు

- రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌

ఆదుకోండి సారూ..: వరదల్లో సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని

ఫిలింనగర్‌ బస్తీలో మంత్రి కేటీఆర్‌ కాళ్ల మీదపడి వేడుకొంటున్న మహిళలు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అంతా అప్రమత్తత ప్రకటించినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అధికార యంత్రానికి అన్ని రకాల ప్రభుత్వ సెలవులు, వ్యక్తిగత సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కార్యస్థానాల్లోనే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదన్నారు.

సహాయ కేంద్రంలో సంప్రదించవచ్చు: మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

అధిక వర్షాల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని వరద బాధితుల సహాయార్థం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. 94924 09781, 08418-297820 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

ఇవీచూడండి:వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details