Hyderabad market has become rushed: దసరా సందర్భంగా హైదరాబాద్‌లో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. దసరా పురస్కరించుకుని... మాంసపు ప్రియులు జియాగూడ మేకల మండికి తరలివచ్చారు. మేకల క్రయవిక్రయాలతో జియాగూడ మార్కెట్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ నుంచి మేకలు పెద్దసంఖ్యలో నగరంలోని మేకల మార్కెట్‌కు చేరుకున్నాయి.
దసరా సందర్భంగా రద్దీగా మారిన నగర మార్కెట్లు.. - హైదరాబాద్ తాజా వార్తలు
HYDERABAD markets has become rushed: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని జియాగూడ మేకల మండికి మాంసపు ప్రియులు తరలివచ్చారు. అలాగే గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భారీ మొత్తంలో కొనుగోలుదారులు బారులు తీరారు.
![దసరా సందర్భంగా రద్దీగా మారిన నగర మార్కెట్లు.. rush](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16558505-192-16558505-1664946164508.jpg)
మార్కెట్
నగరంలోని మార్కెట్ల వద్ద రద్దీ
మరోవైపు గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే నగరవాసులు పూలు కొనేందుకు మార్కెట్లో బారులు తీరారు. రోడ్డుకు ఇరువైపుల గుమ్మడికాయల వ్యాపారం జోరందుకుంది. పదుల సంఖ్యలో మార్కెట్ వద్దకు లారీలు చేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సాధారణ రోజులతో పోలిస్తే ధరతో పాటు రద్దీ కూడా ఎక్కువగానే ఉందని స్థానిక వ్యాపారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Oct 5, 2022, 11:38 AM IST