తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆన్​లైన్​లో మద్యం అమ్మకాల పేరిట మోసం

ఆన్​లైన్​లో మద్యం అమ్మకాల పేరిట తనను మోసం చేశారంటూ హైదరాబాద్​ సుల్తాన్​ బజార్​కు చెందిన వ్యక్తి సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు.

By

Published : Apr 14, 2020, 8:44 PM IST

ccs
ఆన్​లైన్​లో మద్యం అమ్మకాల పేరిట మోసం

హైదరాబాద్​లో మరో ఆన్​లైన్​ మోసం బట్టబయలైంది. క్యూఆర్‌ కోడ్‌కు డబ్బు పంపితే మద్యం సరఫరా చేస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.

బగ్గా వైన్స్ పేరుతో క్యూఆర్ కోడ్ పంపించి.. దానికి నగదు పంపిస్తే అరగంటలో ఇంటికే మద్యం సరఫరా చేస్తామని మోసగాళ్లు మభ్యపెట్టారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ చెందిన ఓ వ్యక్తి అంతర్జాలం ద్వారా తొలుత రూ.1600 పంపించాడు. తక్కువ ధర మద్యం సీసాలు లేవంటూ.. మూడు కేవైసీ నంబర్లను నేరగాళ్లు పంపించారు. నిజమేనని నమ్మిని బాధితుడు రూ.92 వేల నగదును బదిలీ చేశాడు.

మద్యం డెలివరీపై పలుమార్లు ఫోన్‌ చేసినా దుండగులు స్పందించలేదు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీచూడండి:వాట్సాప్‌లో గుట్టు.. జర భద్రం

ABOUT THE AUTHOR

...view details