ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్లను వ్యతిరేకిస్తూ.. తక్షణమే ఆ విధానాన్ని రద్దు చేయాలని హైదరాబాద్ అల్వాల్లో భాజపా శ్రేణులు డిమాండ్ చేశారు. ఓల్డ్ అల్వాల్ సర్కిల్లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని భాజపా శ్రేణుల డిమాండ్ - తెలంగాణ వార్తలు
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని హైదరాబాద్ అల్వాల్లో భాజపా శ్రేణులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలో కొనసాగించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని భాజపా శ్రేణులు డిమాండ్
నూతన పద్ధతి వల్ల రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలో కొనసాగించాలని కోరారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.