Etela Rajender Comments: తెరాస అధినేత కేసీఆర్ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని.. తన సొంత పనితీరుతోనే నెగ్గుకొస్తున్నానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పదవుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేరలేదని ఉద్ఘాటించారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన విధంగానే ఇతర నేతలపైనా సీఎం ప్రయోగాలు చేశారని.. ఫలితంగా వారంతా ఓడిపోయారని.. తానొక్కడు మాత్రమే గెలిచానన్నారు. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరని.. అతి విధేయంగా ఉండేవారినే నాయకుడిగా భావిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'కేసీఆర్ బొమ్మతో కాదు.. నా సొంత పని తీరుతోనే గెలుస్తూ వచ్చా..' - ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
Etela Rajender Comments: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మతో గెలవలేదని.. తన సొంత పనితీరులోనే గెలుస్తూ వచ్చినట్టు స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరని ఈటల ఆరోపించారు.
"పదవుల కోసం నేను తెలంగాణ ఉద్యమంలో చేరలేదు. నేను ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్ బొమ్మతో కాదు. నా సొంత పనీతీరుతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాను. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరు. అతి విధేయతగా ఉండేవారినే కేసీఆర్ నాయకుడిగా భావిస్తారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారు. మంత్రిగా ఉన్న నా ఇంట్లో ఎన్నికలప్పుడు పోలీసుల తనిఖీలు జరిగాయి. నాతో పాటు మరికొందరు తెరాస నేతలను ఓడించాలని చూశారు. వాళ్లంతా ఓడిపోయినా.. నేను మాత్రం ప్రజల అభిమానంతో గెలిచాను." - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
ఇవీ చూడండి: