ఏపీలోని చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్... అతని భార్యతో కలిసి బెంగళూరులో నివసించేవాడు. ఇద్దరికీ కరోనా సోకిన కారణంగా.. కుప్పం వచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.
విషాదం: అర్ధాంగి ఒడిలో అర్ధాంతరంగా ఆగిన గుండె
కరోనా నుంచి కోలుకున్న దంపతులు ఇంటికి బయల్దేరారు. అంతలోనే.. భర్తకు మళ్లీ సమస్య తలెత్తింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతను.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. తన కళ్లెదుటే భర్త చనిపోవడాన్ని చూసి... భార్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
husband died in wife hands
అనంతరం బెంగళూరు వెళ్లేందుకు కుప్పం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ప్లాట్‌ఫాంపై రైలు కోసం నిరీక్షిస్తుండగా... చంద్రశేఖర్ మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. ఏమైందో తెలిసేలోపే... భార్య ఒడిలో కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.