తెలంగాణ

telangana

ETV Bharat / city

భార్యతో గొడవ పడి సెల్​ టవర్​ ఎక్కిన భర్త

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్టీ కాలనీలో ఉండే వెంకటేశ్వర్లు మంగళవారం మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. అనంతరం భార్య భర్తలు గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన భర్త స్థానికంగా ఉన్న సెల్​టవర్​ ఎక్కాడు.

భార్యపై అలిగి సెల్​ టవర్​ ఎక్కిన భర్త
భార్యపై అలిగి సెల్​ టవర్​ ఎక్కిన భర్త

By

Published : May 7, 2020, 7:55 PM IST

భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భార్యపై అలిగి భర్త సెల్​ టవర్​ ఎక్కిన ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తాగిన మైకంలో అలిగిన వెంకటేశ్వర్లు స్థానిక ఎక్సైజ్​ కార్యాలయం వెనుక ఉన్నసెల్​ టవర్​ ఎక్కి దూకుతానని బెదిరించాడు. అరగంటకుపైగా సెల్​టవర్​పైనే ఉండి హల్​చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై ముక్కంటి వెంకటేశ్వర్లు బాధితుడితో మాట్లాడి చాకచక్యంగా కిందకు దిగేలా చేశారు.

ABOUT THE AUTHOR

...view details