HUSBAND CARRYING HIS WIFE: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన వరదా వీరవెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్యకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. ఆ దంపతులు ఇటీవల తిరుపతికి వెళ్లారు. తిరుమలలోని శ్రీవారిని కాలినడకన దర్శించుకోవడానికి బయలుదేరారు. మెట్ల మార్గంలో సత్తిబాబు వేగాన్ని ఆయన భార్య అందుకోలేకపోయారు.
భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త.. వీడియో వైరల్.. - భార్యను భుజాలపై ఎత్తుకుని 70 మెట్లు ఎక్కిన భర్త
HUSBAND CARRYING HIS WIFE: ఆ దంపతులకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. తాజాగా వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. కాలినడకన స్వామి దర్శనానికి బయలుదేరారు. కొద్దిసేపటికి భర్త వేగాన్ని భార్య అందుకోలేకపోయింది. దాంతో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పందేనికి దారి తీసింది. భార్యను భుజాలపై ఎత్తుకుని దాదాపు 70 మెట్లు ఎక్కేశాడు భర్త. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
HUSBAND CARRYING HIS WIFE
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ పందేనికి దారితీసింది. ఆ మేరకు సత్తిబాబు భార్యను భుజాలపై ఎత్తుకుని దాదాపు 70 మెట్లు ఎక్కేశాడు. ఆ దృశ్యాలను ఇతర భక్తులు చరవాణుల్లో బంధించారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇవీ చదవండి: