తెలంగాణ

telangana

ETV Bharat / city

లైవ్​ వీడియో: ఆలయంలో హుండి ఎత్తుకెళ్లిన దొంగ - లంకల గన్నవరంలో హుండీ దొంగతనం

ఏపీ తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. హుండీని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hundi chori
ఆలయంలో దొంగతనం

By

Published : Mar 29, 2021, 8:13 PM IST

ఏపీ తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం ముందు ఉన్న హుండీని ఒక దొంగ బయటకు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.

ఆలయానికి వెనక వైపున ఉన్న కొబ్బరితోటలో ధ్వంసమైన హుండీని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హుండీని ఆలయంలో ఉంచి పరిశీలించారు. అందులో సొమ్ము ఎంతపోయిందన్నదీ తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో దొంగతనం

ఇదీ చూడండి:'ఆరోజు నగరంలోని పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం'

ABOUT THE AUTHOR

...view details