తెలంగాణ

telangana

ETV Bharat / city

Humans Life Span Increased: దేశంలో పెరిగిన మానవుల ఆయుష్షు - Humans Life Span Increased

Humans Life Span Increased : గడచిన 50 ఏళ్లలో పోల్చుకుంటే దేశంలో మానవుల సగటు జీవితకాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉండగా.. 2020 నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విషయంలో విశేష పురోగతి కనిపిస్తోంది.

Humans Life Span Increased
Humans Life Span Increased

By

Published : Apr 6, 2022, 11:47 AM IST

Humans Life Span Increased : గడచిన 50ఏళ్లలో పోల్చుకుంటే దేశంలో మానవుల సగటు జీవిత కాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉండగా.. 2020 నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విషయంలో విశేష పురోగతి కనిపిస్తోంది. జీవిత కాలం పెరిగిన రాష్ట్రాల జాబితాలో తొలుత ఉత్తరప్రదేశ్‌ ఉండగా.. తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌, అస్సాం, ఏపీ వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఏషియా పసిఫిక్‌ అబ్జర్వేటరీ ఆన్‌ హైల్త్‌ సిస్టమ్స్ అండ్‌ పాలసీస్‌ విడుదల చేసిన భారతలో ఆరోగ్య రంగం.. సమీక్ష నివేదిక దీన్ని వెల్లడించింది. 1970 నుంచి ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ఆయా శాఖల నివేదికను డబ్ల్యూహెచ్​వో తాజాగా విడుదల చేసింది. పబ్లిక్‌హెల్త్‌ ఫౌండెషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఇన్‌స్టిట్టూట్‌ ఆఫ్ హెల్త్‌, జిందాల్‌ విశ్వవిద్యాలయం, జర్మనీకి చెందిన మెడికల్‌ ఫ్యాకల్టీ అండ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details