తెలంగాణ

telangana

ETV Bharat / city

పేదింటికి రూ.లక్ష పన్ను.. లబోదిబోమంటున్న యజమాని! - కాకినాడలో ఇంటి లక్ష ఇంటి పన్ను

House Tax: ఏపీలో పన్నుల బాదుడుపై ఓ వైపు ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు అధికారులు తమ పనిని తాము కానిచ్చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంటికి నగరపాలక సంస్థ రూ.లక్షా 5 వేల పన్ను విధించింది. తీవ్ర అందోళనకు గురైన ఇంటి యజమాని.. చేపల వేటతో జీవించే తాము రూ.లక్ష ఎలా కట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

పేదింటికి  రూ.లక్ష పన్ను.. లబోదిబోమంటున్న యజమాని!
పేదింటికి రూ.లక్ష పన్ను.. లబోదిబోమంటున్న యజమాని!

By

Published : Mar 27, 2022, 7:02 PM IST

House Tax: ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంటికి.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను విధించింది నగరపాలక సంస్థ!. పర్లోవపేటలో 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటికి.. గతం నుంచి ఇంటి పన్ను బకాయి ఉంది. దీంతో.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను చెల్లించాలంటూ.. తాజాగా అధికారులు నోటీసు ఇవ్వడంతో ఇంటి యజమాని దిప్పాడ వెంకన్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.

చేపల వేట సాగించి జీవనం సాగించే తాము.. అంత డబ్బులు ఎలా చెల్లించాలని వాపోతున్నారు. ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేశారని కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటికి అంత పన్ను వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పు చేసి రూ.5 వేలు చెల్లించినా నీటి సరఫరా పునరుద్ధరించటంలేదని వాపోయారు.

పేదింటికి రూ.లక్ష పన్ను.. లబోదిబోమంటున్న యజమాని!

'ఒక్క గదిలోనే పది మంది ఉంటున్నాం. పిల్లల చదువుల ఖర్చులే వెల్లదీయలేని పరిస్థితి ఉంది. ఇవాళో రేపో కూలిపోయే ఇంటికి అంత పన్ను వేశారు. మేం అంత కట్టలేం.' -బాధితులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details