కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం - herbal medicine for corona in telangana
10:35 May 21
ఏపీ : నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి పోటెత్తిన ప్రజలు
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ప్రజలు పోటెత్తుతున్నారు. కోరనా చికిత్సకు ఆయుర్వేద మందు కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. మందు పంపిణీకి ఏపీ అధికారులు అనుమతించలేదు. పెద్దసంఖ్యలో వస్తున్న ప్రజల వల్ల రద్దీ పెరిగింది. కరోనా వ్యాప్తి చెందే అవకాశమున్నందున ప్రజలను పోలీసులు అదుపు చేస్తున్నారు.
కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపాయాయి. దాదాపు 60వేల మంది జనం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. రోజుకు 3వేల మందికే ఆయుర్వేద మందు ఇవ్వగలమని నిర్వాహకులు తెలిపారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనం.. వారిని అదుపుచేస్తున్న పోలీసులతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.