రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి లిక్కర్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు 10,926 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది కంటే అధికంగా పోటీ ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఆబ్కారీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9న ప్రారంభం కాగా... ఈ నెల 16న ముగియనుంది. కొత్తగా ఏర్పాటుచేయనున్న 2,216 మద్యం దుకాణాలకు గానూ శనివారం వరకు నాలుగు రోజుల్లో 4,215 దరఖాస్తులు అందాయి. ఇవాళ భారీ సంఖ్యలో పత్రాలు సమర్పించారు. ఇవాళ ఒక్క రోజే 6,711 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది.
మద్యం టెండర్లకు భలే గిరాకీ.. - more response to liquor tenders
రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్ల గిరాకీ జోరు మీదుంది. గత ఏడాది కంటే ఈసారి పోటీ పెరిగింది. ఇప్పటివరకు సుమారు 11 వేల దరఖాస్తులు వచ్చాయి.
మద్యం టెండర్లకు భలే గిరాకీ..