హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఈనెల 23న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. కవులు, కళాకారులు, రచయితలు బుక్ ఫెయిర్‌ను సందర్శించి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన - హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు అనూహ్య స్పందన లభిస్తోంది. సందర్శకులు భారీగా వచ్చి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు.
hyderabad book fair
అన్ని భాషలకు చెందిన నవలలు సందేశాత్మకమైన పుస్తకాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, సినిమా కథ పుస్తకాలు, చరిత్ర, చిన్నారుల కథల పుస్తకాలు, కామిక్స్ వంటి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తమకు కావాల్సిన పుస్తకాలు అన్నీ ఒకే దగ్గర దొరకడం... రాయితీలు ఇస్తుండటం వల్ల ఇక్కడికి వస్తున్నట్లు సందర్శకులు తెలిపారు.
ఇదీ చూడండి: పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన