ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.1.42 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. గడచిన 20 రోజుల హుండీ ఆదాయాన్ని అధికారులు.. సోమవారం లెక్కించారు. స్థానిక ప్రమోద కల్యాణ మండపం ఆవరణలో.. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ లెక్కింపు నిర్వహించారు.
ద్వారకా తిరుమలలో హుండీ లెక్కింపు.. శ్రీవారికి భారీగా ఆదాయం - ద్వారకాతిరుమలలో శ్రీవారికి భారీగా సమకూరిన ఆదాయం
గత 20 రోజుల్లో హుండీ ద్వారా శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానంలో సోమవారం.. లెక్కింపు చేపట్టగా.. రూ. 1.42 కోట్ల నగదు, 235 గ్రాముల బంగారం, 8.845 కేజీల వెండి స్వామివారికి కానుకలుగా వచ్చినట్లు ఆలయ ఈవో సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ద్వారకా తిరుమలలో హుండీ లెక్కింపు
గడచిన 20 రోజులకుగాను జరిగిన ఈ హుండీ లెక్కింపులో.. శ్రీవారికి నగదు రూపేణా రూ. 1,42,44,793 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 235 గ్రాముల బంగారం, 8.845 కేజీల వెండి వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ సైతం హుండీలో భారీగానే లభ్యమైనట్లు చెప్పారు.
ఇవీచూడండి:వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయొద్దు: ఈటల