తెలియని మార్గాల (అన్‌నోన్ సోర్స్(Unknown source)) ద్వారా ఆదాయం సమకూరిన ప్రాంతీయ పార్టీల్లో(Regional parties) తొలి మూడు స్థానాల్లో తెరాస(TRS), తెదేపా(TDP), వైకాపా(YCP) నిలిచాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీల(Regional parties)కు 2019-20లో వచ్చిన ఆదాయాల్లో అత్యధికం తెలియని మార్గాల నుంచే వచ్చాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్(Association for Democratic Reform)) తన నివేదికలో పేర్కొంది.
కంట్రిబ్యూషన్(contribution), ఆడిట్(audit) నివేదికల ఆధారంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 53 పార్టీల ఆదాయాలను విశ్లేషించాలని ఏడీఆర్ నిర్ణయించగా.. 28 పార్టీలే ఈ రెండు నివేదికలను ఈసీఐకి సమర్పించాయి. ఆప్, ఎల్జేపీ, ఐయూఎంఎల్ రెండు నివేదికలూ ఇచ్చినా వివరాల్లో వైరుధ్యాలు ఉండడంతో వీటిని మినహాయించి 25 పార్టీల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. తెలియని మార్గాలంటే.. రూ.20 వేలకు లోపు విరాళాలు, ఎలక్ట్రోరల్ బాండ్లు, కూపన్లు తదితరాలుంటాయి. ఈ వివరాలను ఆ పార్టీలు వివరణాత్మకంగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు.