హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్, బాహ్యవలయ రహదారిపై బుధవారం ఉదయం నుంచి పొగమంచు కురుస్తోంది. దట్టమైన పొగమంచు విజయవాడ రహదారిని కప్పివేసింది. మంచులో నగరశివారుల అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
భాగ్యనగర శివార్లను కమ్మేసిన పొగమంచు.. - భాగ్యనగర శివార్లను కమ్మేసిన పొగమంచు..
పొగమంచు భాగ్యనగరాన్ని కప్పేసింది. నగర శివారుల్లోని రహదారులన్ని మంచు దుప్పటి కప్పుకున్నాయి. మంచుకురిసే వేళలో ఉషోదయం చూపరులను ఆకట్టుకుంటుంది.
భాగ్యనగర శివార్లను కమ్మేసిన పొగమంచు..
అయితే ఉదయం ఎనిమిది గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు. రోడ్డు కనిపించకపోవడం, ఎదురుగా ఉన్న వాహనాన్ని గుర్తించలేక ఇబ్బంది పడ్డారు.
ఇవీ చూడండి:తాగునీరు విషతుల్యం- భారలోహాలతో కలుషితం!