గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,98,815కు చేరింది. వైరస్ బారిన పడి మరణించన వారి సంఖ్య 7,205కు పెరిగింది.
కరోనా కలవరం.. ఒక్కరోజే వెయ్యి దాటిన కొవిడ్ కేసులు - andhrapradhesh latest news
ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,005 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించింది.
ఏపీలో పెరుగుతున్నో కరోనా ఉద్ధృతి
కరోనా నుంచి మరో 324 మంది కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,86,216కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 5,394 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షలు 1,49,90,039కి పెరిగాయి.