గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు (corona tests) నిర్వహించగా... కొత్తగా 1,869 కరోనా కేసులు, 18 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ నుంచి మరో 2,316 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా మృతులు...
కరోనా కారణంగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.