ఏపీలో కరోనా కేసులు(AP Corona Cases) తగ్గుతున్నా.. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,43,557కు చేరింది. మరణాల సంఖ్య 10,531కు ఎగబాకింది. వైరస్ నుంచి మరో 21,385 మంది కోలుకోగా ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 14,46,244కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,782 కరోనా యాక్టివ్ కేసులు(AP Corona Cases) ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 84,224 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా కరోనా మృతులు...