ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు AP CORONA CASES: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కోలుకుంటున్న వారి సంఖ్య కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పండగ సమయాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 47,884 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,348 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కరోనా నుంచి 261 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 14,204 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాలు...
అనంతపురంలో 230, చిత్తూరులో 932, తూర్పుగోదావరిలో 247, గుంటూరులో 338, కడపలో 174, కృష్ణాలో 296, కర్నూలులో 171, నెల్లూరులో 395, ప్రకాశంలో 107, శ్రీకాకుళంలో 259, విశాఖపట్నంలో 823, విజయనగరంలో 290, పశ్చిమగోదావరిలో 86 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
దేశంలోనూ పెరుగుతున్న కేసులు..
Corona cases in India: భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,47,417 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,63,17,927
- మొత్తం మరణాలు:4,85,035
- యాక్టివ్ కేసులు:11,17,531
- మొత్తం కోలుకున్నవారు:34,715,361
Omicron Cases In India:దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India:భారత్లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,32,024 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,45,916 మందికి కరోనా సోకింది. 8,032 మంది ప్రాణాలు కోల్పోయాు. దీంతో మొత్తం కేసులు 31,75,55,259కి చేరగా.. మరణాలు 55,30,352కు పెరిగింది.
ఇదీచదవండి.