తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రైవేట్ రైళ్లను నడిపించేందుకు భారీగా దరఖాస్తులు - railway department

150 రూట్లలో ప్రైవేట్​ రైళ్లను ప్రవేశపెట్టేందుకు 12క్లస్టర్లుగా విభజించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రైవేట్​ రైళ్లను నడిపించేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వివిధ ప్రైవేట్​ రంగ సంస్థలు భారీగా పెట్టుబడి పెట్టినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

Huge applications to run private trains
ప్రైవేట్ రైళ్లను నడిపించేందుకు భారీగా దరఖాస్తులు

By

Published : Nov 20, 2020, 11:28 PM IST

ప్రైవేట్ రైళ్లను నడిపించేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు రైల్వేశాఖ తెలిపింది. 151 ఆధునిక రైళ్లను 150 రూట్లలో ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు 12 క్లస్టర్లుగా విభజించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ఆసక్తిని కనబరిచినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు వివిధ ప్రైవేట్ రంగ సంస్థలు సుమారు రూ.30వేల కోట్ల వరకు పెట్టుబడిని పెట్టినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. 16 దరఖాస్తుదారుల సంస్థల నుంచి 12 క్లస్టర్ల కోసం 120 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 102 దరఖాస్తులు ఆర్ఎఫ్​పీ దశలో పాల్గొనడానికి అర్హత సాధించాయని రైల్వేశాఖ వెల్లడించింది. సికింద్రాబాద్ క్లస్టర్ నుంచి 9 దరఖాస్తులు వచ్చాయి.

  • పీపీపీ(ప్యాసింజర్ ట్రైన్ ఆపరేషన్ ప్రాజెక్ట్) కింద అర్హత సాధించిన సంస్థల వివరాలను రైల్వే శాఖ తెలియజేసింది.

అర్హత సాధించిన సంస్థలు

1.క్యూబ్ హైవేస్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్

2.గేట్​వే రైల్ ప్రైవేట్ లిమిటెడ్

3.జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్

4.ఇండియన్​ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్

5.ఐఆర్​బీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్

6.ఎల్ అండ్ టీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్ లిమిటెడ్

7.మల్లేపాటి పవర్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్నో ఇన్​ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్

8.మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్

9.వెల్​స్పన్ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్

  • వీటితో పాటు పీపీపీ(ప్యాసింజర్ ట్రైన్ ఆపరేషన్ ప్రాజెక్ట్)లో వివిధ క్లస్టర్లలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను రైల్వేశాఖ తెలిపింది.

1. ముంబయి -1వ క్లస్టర్​కు 8 దరఖాస్తులు

2. ముంబయి-2వ క్లస్టర్​కు 11 దరఖాస్తులు

3. దిల్లీ-1వ క్లస్టర్​కు 9 దరఖాస్తులు

4. దిల్లీ -2వ క్లస్టర్​కు 10 దరఖాస్తులు

5. చంఢీఘడ్ క్లస్టర్​కు 8 దరఖాస్తులు

6. హౌరా క్లస్టర్​కు 8 దరఖాస్తులు

7. పాట్నా క్లస్టర్​కు 8 దరఖాస్తులు

8. ప్రయాగ్​రాజ్ క్లస్టర్​కు 9 దరఖాస్తులు

9. జైపూర్ క్లస్టర్​కు 9 దరఖాస్తులు

10. చెన్నై క్లస్టర్​కు 5 దరఖాస్తులు

11. బెంగళూరు క్లస్టర్​కు 8 దరఖాస్తులు

ఇవీ చూడండి: దిల్లీ నుంచి ముంబయికి విమానాలు బంద్‌!

ABOUT THE AUTHOR

...view details