ప్రస్తుత అంతర్జాల యుగంలో ఈ-మెయిల్ తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఈ-మెయిల్ ఖాతాలను కలిగిన వారు చాలా మందే ఉంటారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, సమాచారాన్ని అందులో దాచుకుంటుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీ ఈ-మెయిల్ ఖాతాలు హ్యాక్‌కు గురవుతాయని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఇదే జరిగితే మీ బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురవుతాయని చెబుతున్నారు.
ఎలా హ్యాక్ చేస్తారు?
స్పామ్ మెసేజ్‌లు, ఫైల్స్‌కు చిన్న చిన్న ఏపీకే ఫైల్స్ అనుసంధానం చేసి ఇతరులకు సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేయగానే వైరస్ కంప్యూటర్లో ఇన్స్టాల్ అవుతుంది. దీనివల్ల ఈ-మెయిల్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం నేరస్తుల చేతిలోకి వెళుతుంది. అంతేకాకుండా మెయిల్‌కు ఇచ్చిన పాస్‌వర్డ్‌నే వేరే బ్రౌజర్లు, బ్యాంకు ఖాతాలకు ఇస్తే వాటిని సైతం నిందితులు హ్యాక్ చేసే అవకాశముంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది మెయిల్స్ ఇప్పటికే ఎన్నోసార్లు హ్యాక్ అయి ఉంటాయని చెపుతున్నారు.
హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే?