తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​ పోలీస్ స్టేషన్ల ఎదుట భారీగా యువత - corona effect on students

హైదరాబాద్​ పరిధిలోని అమీర్​పేట్, ఎస్​ఆర్​ నగర్​, గచ్చిబౌలి, మాదాపూర్​, రాయదుర్గం, బాలానగర్​ ప్రాంతాల్లోని విద్యార్థులకు కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. లాక్​డౌన్​ దృష్ట్యా వసతి గృహాలు ఖాళీ చేయాలని కోరడం వల్ల దిక్కుతోచని స్థితిలో వారంతా సమీప పోలీస్​ స్టేషన్లకు భారీగా చేరుకుంటున్నారు. గుర్తింపు కార్డులు, వాహనాలు సమకూర్చుకున్న వారికి స్వగ్రామాలకు వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

hostel students gathered at various ps in hyderabad
పోలీస్​స్టేషన్ల ముందు బారులు తీరిన యువతీ యువకులు

By

Published : Mar 25, 2020, 4:33 PM IST

Updated : Mar 25, 2020, 5:42 PM IST

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో వసతి గుహాల్లో ఉంటున్న విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. హైదరాబాద్ అమీర్‌పేట, ఎస్‌ఆర్​నగర్‌ పరిధిలోని ప్రైవేటు వసతిగృహాలను యాజమానులు మూసివేస్తున్నారు. అందులో ఉన్న విద్యార్థులను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ నిర్వాహకులు ఆదేశించారు. దీంతో దిక్కుతోచని విద్యార్థులు ఎస్​ఆర్​నగర్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు.

ఒక్కసారి సుమారు ఐదారు వందల మంది విద్యార్థులు పోలీస్​స్టేషన్​కు చేరుకోవడం వల్ల పోలీసులు అయోమయానికి గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆధార్​ కార్డు చూపించి, వాహనం సమకూర్చుకుంటే విద్యార్థులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని పశ్చిమ మండలం అడిషనల్​ సీపీ ఏఆర్​ శ్రీనివాస్​ తెలిపారు.

ఐటీ కారిడార్​లో..

గచ్చిబౌలి, మాదాపుర్, రాయదుర్గం ఐటీ కారిడార్​లో ఉద్యోగాలు చేసే వందల మంది యువతీయువకులు వసతి గృహాల్లో నివాసం ఉంటున్నారు. నిర్వాహకులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరడం వల్ల స్వగ్రామాలకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోసం ఆయా పోలీస్​స్టేషన్ల ముందు బారులు తీరారు.

బాలానగర్​లో..

బాలానగర్ డివిజన్​లోను ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు బాలానగర్​ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్​వోసీ పత్రాలు మంజూరుచేయాలని పోలీసులను కోరారు. వారందరూ ఇళ్లకు వెళ్లేందుకు పాసులు మంజూరుచేస్తున్నట్లు బాలానగర్​ ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

హైదరాబాద్​ పోలీస్ స్టేషన్ల ఎదుట భారీగా యువత

ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

Last Updated : Mar 25, 2020, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details