దసరా ఉత్సవాల్లో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర గ్రామానికి చెందిన యాదవ రాజవంశీకులు.. గుర్రాల పార్వేట వేడుకల (Horse Racing)ను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అశ్వాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి... వారి పూర్వీకులు నిర్మించిన కుల దైవం భోగేశ్వర ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆయుధాల ప్రదర్శన చేశారు.
Horse racing: ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు - మద్దికేర గ్రామంలో గుర్రాల పార్వేట ఉత్సవం
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పత్తికొండ నియోజకవర్గం మద్దికేర గ్రామానికి చెందిన యాదవ రాజవంశీకులు గుర్రాల పార్వేట వేడుకలను నిర్వహించారు. గుర్రాల పరుగు పందెం (Horse Racing) పోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వేలాది మంది తరలి వచ్చారు.
పార్వేట ఉత్సవాలు
అనంతరం గుర్రాల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. ఈ పరుగు పందెం (Horse Racing) పోటీల్లో వేమన గారి వర్గానికి చెందిన హర్షవర్ధన్ రాయుడు విజయం సాధించాడు. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వేలాది మంది తరలి వచ్చారు. వందల ఏళ్ల నుంచి తమ సంప్రదాయాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నామని యాదవ రాజులు వారసులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రిన్సిపల్ కుర్చీ కోసం కొట్లాట.. వీడియో వైరల్!