తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - రాశి ఫలాలు చదవడం

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscopes news today, How are the horoscopes today
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

By

Published : May 5, 2021, 4:54 AM IST

దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం. ఆపద, కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహ సూచన. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల పనుల్లో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

శ్రేష్టమైన కాలం. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

సౌభాగ్య సిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. రామనామాన్ని జపిస్తే మంచిది.

మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి.ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సాయి చరిత్ర పారాయణ మంచిది.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీద విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది.

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

ఇదీ చూడండి:తహసీల్దార్​ అనుమతి ఇస్తేనే శుభకార్యం!

ABOUT THE AUTHOR

...view details