గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ చెక్పోస్డు వద్ద హనుమంతు అనే హోంగార్డు విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా హెల్మెట్ లేకుండా వచ్చిన ఓ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నాడు. ద్విచక్ర వాహనం నడుపుతున్న జైదన్ అహ్మద్ (19) అనే యువకుడికి, హోంగార్డుకు మాటా మాటా పెరిగింది. హోంగార్డు ఆ యువకుడిని లాఠీతో కొట్టాడు. అది పొరపాటున జైదన్ అహ్మద్ కంటికింద తాకి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కంటి కింద దెబ్బ బలంగా తాకడం వల్ల మూడు కుట్లు వేసినట్లు యువకుడి బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
హోంగార్డు దాడి.. యువకుడికి గాయాలు
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓయువకుడిని ఆపినందుకు హోంగార్డుకు, యువకుడికి జరిగిన ఘర్షణలో యువకుడి కంటికి గాయమైన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హోంగార్డు దాడి.. యువకుడికి గాయాలు