రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోన్న తీరును పరిశీలించేందుకు హోం మంత్రి మహమూద్ అలీ నేరుగా రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ సందర్భంగా హైదరాబాద్‌లో తాజా పరిస్థితిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పర్యవేక్షించారు. కొత్తపేట, సరూర్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం' - లాక్‌డౌన్ ప్రభావం
ఇదే స్ఫూర్తినే కొనసాగిస్తే కరోనాను కట్టడి చేయగలమని హోంమంత్రి మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ అమలవుతోన్న తీరును రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పర్యవేక్షించారు. కొత్తపేట, సరూర్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
"ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యావసర వస్తువుల వాహనాలు ఎక్కడా ఆపట్లేదు. ప్రజా ఆరోగ్యం కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారు. నిత్యావసర వస్తువులు తీసుకెళ్లేందుకు ఒక్కరే వెళ్లాలి. లాక్‌డౌన్ పరిస్థితిని సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ధైర్యంగా కరోనా సమాచారం అందిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే స్ఫూర్తినే కొనసాగిస్తే కరోనాను కట్టడి చేయగలం. మీడియాకి కూడా పాసులు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కొందరు భోజనాలు అందిస్తున్నారు.. వారికి పాసులు అందిస్తాం" - హోంమంత్రి మహమూద్ అలీ
ఇవీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము