ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జీజీహెచ్‌లో బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని ఆ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. ఈ ఘటన చాలా బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారన్న హోం మంత్రి.. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేసి హంతకుడికి శిక్ష పడేలా చూస్తామన్నారు.
Home minister: 'బాధిత కుటుంబీకులను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం' - రమ్య మృతదేహాన్ని పరిశీలించిన సుచరిత
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో పట్టపగలే దారుణ హత్య (Murder in Guntur)కు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి (Home Minister Sucharitha) పరిశీలించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబీకులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Home minister: 'బాధిత కుటుంబీకులను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం'
దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అదుకుంటుందని సుచరిత హామీ ఇచ్చారు. రమ్య ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చరవాణి ఓపెన్ అయితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
అనుబంధ కథనం:Murder: బీటెక్ విద్యార్థిని పొట్టలో, గొంతులో పొడిచి చంపేశాడు!