తెలంగాణ

telangana

ETV Bharat / city

నష్టపోయిన వారిని వెంటనే గుర్తించాలి: మహమూద్ అలీ

వరద బాధితులకు సాయం అందించడంలో సంబంధిత అధికారుల పాత్ర ముఖ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇళ్లు కోల్పోయిన లేదా దెబ్బతిన్న వాళ్లను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

By

Published : Nov 3, 2020, 10:19 PM IST

home minister mahmood ali review on compensation to flood victims
నష్టపోయిన వారిని వెంటనే గుర్తించాలి: మహమూద్ అలీ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారిని వెంటనే గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. పాతబస్తీ పరిధిలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

బాధితులకు న్యాయం చేయడంలో సంబంధిత అధికారుల పాత్ర ముఖ్యమని.. లబ్ధిదారుల గుర్తింపు ఆధారంగానే ప్రభుత్వం సాయం అందించగలదని మహమూద్ అలీ అన్నారు. వరద బాధితులకు సాయం అందిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాధితులకు సాయం అందలేదనే ఫిర్యాదులొస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇళ్లు కోల్పోయిన లేదా దెబ్బతిన్న వాళ్లను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు హోంమంత్రి సూచించారు.

ఇదీ చూడండి:అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details