తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా కట్టడిలో పోలీసుల పనితీరు అభినందనీయం: హోంమంత్రి

'ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసుల కృషిని అభినందనీయం'
'ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసుల కృషిని అభినందనీయం'

By

Published : Jul 13, 2020, 7:21 PM IST

Updated : Jul 13, 2020, 10:16 PM IST

14:49 July 13

కరోనా కట్టడిలో పోలీసుల పనితీరు అభినందనీయం: హోంమంత్రి

పోలీసు శాఖలో కరోనా పరిస్థితిపై హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. వైరస్ బారిన పడిన పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగుల పట్ల, వారిని ఆసుపత్రికి తరలించే విషయంలో పోలీస్ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై హోంమంత్రి అధికారులతో చర్చించారు. కొందరు పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడిప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారన్నారు. తాను సైతం వైరస్ నుంచి కోలుకొన్న విషయాన్ని హోంమంత్రి ప్రస్తావించారు. పోలీసుల్లో మనోధైర్యం పెంచాలని ఉన్నతాధికారులకు సూచించారు.

కొవిడ్  వారియర్స్​గా...

వైరస్​ నివారణలో పోలీసుల పాత్రపై సీఎం కేసీఆర్​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసుల కృషిని అభినందించారు. కొవిడ్  వారియర్స్​గా పోలీస్ సిబ్బంది చక్కటి పనితీరును కనబరిచి ప్రజల మెప్పు పొందారని ప్రశంసించారు.  

Last Updated : Jul 13, 2020, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details