పూర్తి సహకారం.. సినీ పరిశ్రమపై హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలు - Home Minister Mahamood Ali
12:51 March 02
పూర్తి సహకారం.. సినీ పరిశ్రమపై హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలు
Home Minister Mahamood Ali: తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సినీ పరిశ్రమకు తాము సపోర్టు అంటూ వ్యాఖ్యలు చేశారు. 'సదా నిన్ను నడిపే' అనే సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉందన్నారు. తెరాస ప్రభుత్వం సినీ పరిశ్రమకు పూర్తి అండగా ఉందని ఆయన అన్నారు. వచ్చే ఐదేళ్లలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ మరో ముంబయిలా మారుతుందన్నారు. చిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సహకారం అందిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
TAGGED:
Home Minister Mahamood Ali