పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించారు. దోషులు ఎంతటి వారైనా.. కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు.
న్యాయవాద దంపతుల హత్యలను ఖండించిన హోంమంత్రి - telangana crime news
హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలను హేయమైన చర్యగా హోంమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.
న్యాయవాద దంపతుల హత్యలను ఖండించిన హోంమంత్రి
నిందితులను పోలీసులు గుర్తించారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు.
ఇవీచూడండి:పట్టపగలు న్యాయవాద దంపతుల దారుణ హత్య