అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోష్ మీదున్నారు. యువ కథానాయకులకు దీటుగా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో సినిమా 'గాడ్ ఫాదర్'. అయితే ఈ చిత్రంలో ఓ పాటను హాలీవుడ్ పాప్ సింగర్‌తో పాడించేందుకు తమన్ ప్రయత్నిస్తున్నాడట.
'గాడ్ ఫాదర్' సినిమాలో హాలీవుడ్ పాప్ సింగర్! - గాడ్ ఫాదర్
గాడ్‌ఫాదర్ చిత్రంలోని ఓ పాటను హాలీవుడ్ పాప్ సింగర్‌తో పాడించనున్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పాప్ సింగర్ ఎవరంటే..
Godfather
'గాడ్ ఫాదర్' సినిమాలో హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌తో తమన్ ఓ పాట పాడించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఏ వివరాలను 'గాడ్ ఫాదర్' చిత్ర బృందం అధికారికంగా బహిర్గతం చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి:'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు