తెలంగాణ

telangana

ETV Bharat / city

9వ తరగతి వరకు సెలవులు.. టీకాతో కరోనా రాదు: ఏపీ సర్కారు - andhrapradesh latest news

schools bandh in ap
ఏపీలో పాఠశాలలకు సెలవులు

By

Published : Apr 19, 2021, 3:37 PM IST

Updated : Apr 19, 2021, 4:01 PM IST

15:36 April 19

9వ తరగతి వరకు సెలవులు.. టీకాతో కరోనా రాదు: ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.

అదే విధంగా వ్యాక్సినేషన్​పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లపై ప్రభుత్వం స్పందించింది. కొవాక్జిన్ అనేది ఉత్తేజంలేని వ్యాక్సిన్‌ అని, కొవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సిన్‌ అని.. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించింది. ఇందులో 'సార్స్​ కోవి2' వైరస్ లేదని, 'సార్స్​ కోవి2' జన్యు పదార్థంలో కొంతభాగం మాత్రమే ఉంటుందని పేర్కొంది.  

ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ ఆర్టీపీసీఆర్​కు దారితీయవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ తరువాత ఆర్టీపీసీఆర్​లో పాజిటివ్ నిర్ధరణ అయితే, వారిలో కొవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్థమని తెలిపింది. అంతేకానీ వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ వచ్చినట్లు కాదని పేర్కొంది. కొవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నం

Last Updated : Apr 19, 2021, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details