తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత - corona effect in telangana

Holidays for schools from tomorrow
రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

By

Published : Mar 23, 2021, 5:03 PM IST

Updated : Mar 24, 2021, 1:41 AM IST

17:02 March 23

నేటి నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో ప్రకటించారు. పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాల్లలో ప్రత్యక్ష బోధన బుధవారం నుంచే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని తెలిపారు. గురుకులాలు, వసతి గృహాలనూ మూసివేయాలన్నారు. గతంలో మాదిరిగానే ఆన్​లైన్​ తరగతులు కొనసాగుతాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.  

పది రోజులుగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నందున విద్యా సంస్థలు మూసివేయాలని వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ ప్రకటన చేశారు.  

దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లోనూ చెదురుమదురు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, పంజాబ్​, తమిళనాడు, గుజరాత్​, ఛత్తీస్​గడ్​ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థల్ని మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యాసంస్థల్ని మూసివేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట..విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్ని బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఆదేశాలు వైద్య కళాశాలలు మినహా అన్నింటికీ వర్తిస్తాయి. గతంలో మాదిరిగానే విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు యధావిధిగా కొనసాగుతాయి.

          -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

మే నెలలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆన్​లైన్, టీవీల ద్వారా సిలబస్ పూర్తి చేయడంపై విద్యావేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఇవీచూడండి:'కరోనా కట్టడికి పూర్తి సంసిద్ధతతో ఉన్నాం'

Last Updated : Mar 24, 2021, 1:41 AM IST

ABOUT THE AUTHOR

...view details