తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పోలీసులకు సెలవులు, వారాంతపు సెలవులు రద్దు - ఏపీ ఎస్​ఈసీ వార్తలు

ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో... పోలీసులకు సెలవులు, వారాంతపు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారు.

Police leave canceled until after election in AP
పోలీసులకు సెలవులు, వారాంతపు సెలవులు రద్దు

By

Published : Jan 27, 2021, 12:13 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖలోని అన్ని విభాగాల సిబ్బందికీ.. సాదారణ సెలవులు, వారాంతపు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నుంచి ఫిబ్రవరి 21వరకు సెలవుల రద్దు అమల్లో ఉంటుందని తెలిపారు.

నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని.. ఆరోగ్య రీత్యా , అత్యవసర పరిస్థితుల్లో వారాంతపు సెలవును పరిగణలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details