తెలంగాణ

telangana

ETV Bharat / city

RAINS IN CHITTOOR: రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ - అల్పపీడనం

ఏపీలో భారీ వర్షాలు(heavy rains) కురుస్తున్న నేపథ్యంలో రేపు (శుక్రవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని స్పష్టం చేశారు.

Holiday for educational institutions
Holiday for educational institutions

By

Published : Nov 18, 2021, 9:06 PM IST

అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు(heavy rains) ఏపీలోని తిరుపతి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా వీధులన్నీ చెరువులను తలపించాయి. దీంతో విద్యాసంస్థలకు(educational institutions) రేపు (శుక్రవారం) కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు.

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న చోట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇదీ చూడండి: rains in ap: ఏపీలో ఎడతెరిపి లేని వర్షం... తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు

ABOUT THE AUTHOR

...view details