హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ ప్లాట్లు ఇస్తోంది. ఓఆర్ఆర్ ప్రాజెక్టులో మొత్తం 160 మంది భూ నిర్వాసితులను ప్రభుత్వం గుర్తించింది. అందులో ఇప్పటికే 133 మందికి ప్లాట్ల కేటాయింపులు చేసింది.
మిగిలిన 27 మంది బాధితుల్లో 17 మందికి రేపు లాటరీ పద్ధతిన ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఉదయం నానక్‌రామ్‌గూడాలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరగనుంది. వీరికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలోని 17 ప్లాట్లను అందించనున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని 2008లో ప్రారంభించి 2016లో పూర్తి చేశారు. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్లు బాహ్య వలయ రహదారిని నిర్మించారు. 2008, నవంబరు 14న గచ్చిబౌలి - నార్సింగి - శంషాబాద్‌ను కలుపుతూ22 కిలోమీటర్లు, 2010, జులై 7న శంషాబాద్ - పెద్ద అంబర్‌పేట్‌కు 38 కిలోమీటర్లు, 2011, ఆగస్టు 14న నార్సింగి - పటాన్ చెరువుకు వరకు23.7 కిలోమీటర్లు, 2012, డిసెంబరు 3న పటాన్ చెరువు -గౌడవెల్లి, కండ్లకోయి - శామీర్‌పేట వరకు38 కిలోమీటర్లు, 2015, మార్చి 4న పెద్ద అంబర్‌పేట్ - ఘటకేసర్‌కు14 కిలోమీటర్లు, 2016, జూలై 15న ఘటకేసర్ - శామీర్‌పేట వరకు 23 కిలోమీటర్లు రోడ్డు నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేశారు.
ఇదీ చదవండి:Minister Mallareddy: 'ఆ కామాంధున్ని విడిచిపెట్టేది లేదు.. ఎన్కౌంటర్ చేయాలి.. చేస్తం'
ఓఆర్ఆర్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు