నిధుల సమీకరణ కోసం... భూములు అమ్మకానికి(Land Sale) సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. హెచ్ఎండీఏకు చెందిన కోకాపేట భూములతో పాటు టీఎస్ఐఐసీకి చెందిన ఖానామెట్ భూముల విక్రయానికి.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.
Land Sale : భూముల అమ్మకానికి నేడే నోటిఫికేషన్ విడుదల - HMDA land sale for funds
నిధుల సమీకరణకు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ భూముల విక్రయానికి(Land Sale) సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

కోకాపేటలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్ లోని 7 ప్లాట్లతో పాటు.. గోల్డెన్ మైల్ లేఅవుట్ లోని ఒక ప్లాట్ ఉంది. 49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని... ప్లాట్లు, ఖానామెట్‌లో టీఎస్ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను... అమ్మకానికి పెట్టారు. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్‌ఎండీఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను..టీఎస్‌ఐఐసీ నిర్వహించనుంది.
భూముల విక్రయం(Land Sale) కోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. హెచ్‌ఎండీఏ భూములకు 25న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. టీఎస్‌ఐఐసీ భూములకు 26న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. జూలై 13 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ కాగా... హెచ్‌ఎండీఏ భూములకు జూలై 15న, టీఎస్‌ఐఐసీ భూములకు జూలై 16న ఈ -వేలం నిర్వహిస్తారు.
- ఇదీ చదవండి :బంగారు ఆభరణాలపై 'హాల్‌మార్క్'- నేటి నుంచే అమలు