మహారాష్ట్ర, అకోలాలో బ్లడ్ బ్యాంకు, వైద్యసిబ్బంది చేసిన చిన్న నిర్లక్ష్యం కారణంగా.. 8 నెలల చిన్నారి జీవితం అంధకారంలో పడింది. ఆ చిన్నారికి హెచ్ఐవీ సోకింది.
ఏం జరిగిందంటే..?
మహారాష్ట్ర, అకోలా జిల్లా ముర్తిజాపుర్ మండలంలోని హిర్పుర్కు చెందిన దంపతులకు 8 నెలల క్రితం పాప పుట్టింది. చిన్నారి జన్మించిన మూడు రోజుల తర్వాత అనారోగ్యం తలెత్తగా.. ముర్తిజాపుర్లోని పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. పలురకాల వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. చిన్నారికి రక్తకణాలు తక్కువగా ఉన్నాయని.. వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు అకోలాలోని బీపీ ఠాక్రే బ్లడ్‌బ్యాంకు నుంచి రక్తాన్ని తీసుకొచ్చారు. వైద్యులు ఆ రక్తాన్ని చిన్నారికి ఎక్కించారు.