Balakrishna deesksha in Hindupuram: ఏపీలోని హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. తొలుత పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
హిందూపురం కోసం దేనికైనా సిద్ధం
Balakrishna About Hindupuram District Issue : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒకవేళ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా తేల్చిచెప్పారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. అన్ని వసతులున్నందునే ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.