గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా హిమాయత్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు ఉండగా... ప్రస్తుతం అత్యధిక స్థాయిలో 1762.176 అడుగులకు నీరు చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్
హైదరాబాద్ శివారులో కురుస్తున్న వర్షాలకు హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులుండగా.. ప్రస్తుతం 1,762.176 అడుగులకు చేరింది.
భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్
వర్షాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు 833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండిఃహిమాయత్ సాగర్‌కు భారీగా వరద