తెలంగాణ

telangana

ETV Bharat / city

హిమాలయన్​ కంపెనీ ఉద్యోగుల ధర్నా...

హిమాలయన్​ డ్రగ్​ కంపెనీకి చెందిన ఉద్యోగులు హైదరాబాద్​లోని రసూల్​పూరలో ఆందోళన చేపట్టారు. అమ్మకాల పేరిట తమను యాజమాన్యం వేధిస్తోందని ఆరోపించారు. సంస్థ నష్టాల్లో ఉందంటూ.. వైదొలగాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్లు వారు వాపోయారు.

హిమాలయన్​ కంపెనీ ఉద్యోగుల ధర్నా...

By

Published : Oct 16, 2019, 10:26 PM IST

ప్రముఖ సంస్థ హిమాలయ డ్రగ్ కంపెనీ ఉద్యోగులను అమ్మకాల పేరిట వేధిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. సంస్థ నష్టాల్లో ఉందని.. తమపై రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు వారు తెలిపారు. రసూల్​పూరలో ఐక్య గ్రూప్ ఏజెన్సీ ఎదుట హిమాలయ డ్రగ్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హిమాలయ సంస్థ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన సంస్థ కాబట్టే తాము ఉద్యోగులుగా చేరినట్లు తెలిపారు. ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకి సంస్థ నష్టాల్లో ఉందని చెప్పడం వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వారు వాపోతున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్​లో అమ్మకాల విషయంలో ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్నట్లు వారు వాపోయారు. ఉద్యోగులను యాజమాన్యం మభ్యపెడుతోందని.. దేశ వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులు ఉన్నట్లు అందులో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

హిమాలయన్​ కంపెనీ ఉద్యోగుల ధర్నా...

ABOUT THE AUTHOR

...view details