పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు, సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ అకాల మరణాలు తనకు చాలా బాధ కలిగించాయని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. శోభానాయుడు భర్త అర్జున్రావుతో మాట్లాడి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. తెలుగు నాట్యకళను, పాటను ప్రపంచ పటంపై నిలిపి తనదైన ఘనతను సాధించుకున్నారని శోభానాయుడిని కొనియాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రెండు పర్యాయాలు ఆమెను రవీంద్రభారతిలో సన్మానించానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనతో జరిపిన ఆత్మీయ సంభాషణ ఇప్పటికీ జ్ఞాపకం ఉందని ఉద్వేగానికి లోనయ్యారు.
శోభానాయుడు, గుండా మల్లేశ్ల మృతికి దత్తాత్రేయ సంతాపం - పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు
పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు, సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ల మరణాలకు హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఇద్దరితోనూ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇరు కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
![శోభానాయుడు, గుండా మల్లేశ్ల మృతికి దత్తాత్రేయ సంతాపం Himachal Governor bandaru dattathreya tribute to gunda mallesh and shobha naidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9172806-227-9172806-1602672315800.jpg)
Himachal Governor bandaru dattathreya tribute to gunda mallesh and shobha naidu
గుండా మల్లేశ్ కార్మిక నాయకుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి... రాజకీయాల్లో తనదైన శైలిలో కృషి చేసి మంచి పేరును సంపాదించుకున్నారని దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే వారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.