చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్‌లో అఖిషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు కాబోయే గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉండి, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. మతసామరస్యంతో శాంతియుతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. నియమనిష్టలతో పూజలు నిర్వహించి... పది వేల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
గణేశునికి దత్తాత్రేయ ప్రత్యేక పూజలు - bandaru dathathreya
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చిలకలగూడలో గణేశ్ ఉత్సవాలకు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గణేశునికి దత్తాత్రేయ ప్రత్యేక పూజలు