పల్లవి ఇంటర్‌నేషనల్ స్కూల్ 25 వ వార్షికోత్సవాలు మాదాపూర్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. బాల్యం నుంచే సరైన విద్యను అందిస్తే సన్మార్గంలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని దత్తాత్రేయ అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు అందించి... వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన పల్లవి స్కూల్స్ ఛైర్మెన్ కొమరయ్యను అభినందించారు. 36 మందితో ప్రారంభమై... నేడు 10 వేల మంది విద్యార్థులతో పాఠశాల నడవటం గర్వించదగ్గ వియమన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పల్లవి ఇంటర్‌నేషనల్ స్కూలు వార్షికోత్సవాల్లో దత్తాత్రేయ - himachal governer bandaru dathathreya at school anniversary
బాల్యం నుంచే సరైన విద్య అందిస్తే... ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శిల్పకళావేదికలో జరిగిన పల్లవి ఇంటర్‌నేషనల్ స్కూల్ 25 వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు.
పల్లవి ఇంటర్‌నేషనల్ స్కూలు వార్షికోత్సవాల్లో దత్తాత్రేయ