Live Video: చూస్తుండగానే కొండ అమాంతం కూలిపోయింది.. ఎక్కడో తెలుసా..?
Hill Dropped: ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో కొండ కూలింది. తవ్వకాలు జరిపిన వారం తర్వాత కొండ ప్రాంతం ఒక్కసారిగా ఒడ్డుకు జారింది. ఓ వైపు కొండను తవ్వి వదిలేయగా.. మిగతా సగ భాగం కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పెందుర్తి తహశీల్దార్ బాబ్జీ క్వారీని పరిశీలించారు. తవ్వకాలకు ఎంతవరకు అనుమతి ఉందో.. లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. దీనిని తొలగించే వరకు రాకపోకలు నిలుపుదల చేస్తున్నామన్నారు.
hill-dropped-in-a-duvvapalem-quarry-at-visakha