దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ రూ 95.40పైసలకు చేరింది.
మరోవైపు ఏపీలో పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. ఫలితంగా విజయవాడలో పెట్రోల్ రూ.110.80, డీజిల్ రూ.96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.26కు చేరింది.