మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మందడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేస్తుండగా... గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు వాహనానికి రైతులు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. పోలీసు వాహనం టైరు చేయిపైకి ఎక్కడం వల్ల ఓ రైతుకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ మందడం వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
.